Kitchenvantalu

Usirikaya Rasam:ఈ సీజన్ లో వచ్చే రోగాలన్నింటిని పోగెట్టే ఉసిరికాయ రసం.. రుచి సూపర్..

Usirikaya Rasam: చారు ,రసం అనగానే చింతపండు తో చేసేస్తాం కదా.అలా కాకుంట చలికాలంలో దొరికే ఉసిరి కాయలతో రసం చేసి చూడండి.డిఫరెంట్ రుచిగా చాలా బాగుంటుంది.

కావాల్సిన పదార్ధాలు
పేస్ట్ కోసం..
ఉసిరికాయలు – 4
టమాటోలు – 2
జీలకర్ర – 1 ½ టీ స్పూన్
మిరియాలు – 1 టేబుల్ స్పూన్
చారు కోసం..
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
ఇంగువ – 2 చిటికెల్లు
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండుమిర్చి – 1
అల్లం తురుము – ½ టేబుల్ స్పూన్
నీళ్లు – 1.250 లీటర్
ఉప్పు – తగినంత
పసుపు – ½ టేబుల్ స్పూన్
ఉడికించిన పప్పు – ½ కప్పు
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ఉసిరికాయల నుంచి గింజలు తీసేసి ,ఉసిరికాయ ముక్కలతో పాటు చారు పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలన్ని మిక్సిలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడి చేసి అందులోకి ఆవాలు,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు,ఎండు మిర్చి,పచ్చిమిర్చి ,అల్లం వేసి తాలింపును ఎర్రగా వేపుకోవాలి.
3.వేగిన తాలింపులో ఉసిరి ,టమాటో పేస్ట్,ఉప్పు పసుపు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ పై పొంగురానివ్వాలి.
4.మరుగుతున్న చారులో మెత్తగా ఉడికించుకున్న పప్పు కొత్తిమీర వేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News