Kitchenvantalu

Chocolate Sandwich:ఎవ్వరికైనా 100% నచ్చే గొప్ప చాక్లెట్ శాండ్‌విచ్‌ని తినకుండా ఉండలేరు

Chocolate Sandwich: పిల్లలు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్ తో, ఎన్నో వెరైటీస్,స్పెషల్స్, రెడీ చేసుకోవచ్చు. ముంబై స్ట్రీట్ ఫుడ్, చాక్లెట్ శాండ్ విచ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సెమీ స్వీట్ చాక్లెట్ కాంపౌండ్ -100 గ్రాములు
చాక్లెట్ సిరప్ – 3 టేబుల్ స్పూన్స్
బటర్ – 1/4కప్పు
శాండ్ విచ్ బ్రెడ్- 4 స్లైసెస్

తయారీ విధానం
1.రెండు శాండ్ విచ్ బ్రెడ్స్ మీద, బటర్ అప్లై చేసుకోవాలి.
2.బటర్ పైన, చాక్లెట్ సిరప్ పోసి, బ్రెడ్ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి.
3.తర్వాత చాక్లేట్ కాంపౌండ్ ను,రెండు బ్రెడ్ స్లైసెస్ పైన 1/8 మందంతో, తురుముకోవాలి.
4.చాక్లెట్ తురుముకున్న బ్రెడ్ ను, ఒక దానిమీద మరొకటి పెట్టి, పై బ్రెడ్ పై బటర్ పూసుకోవాలి.

5.బటర్ పూసుకున్న వైపునుంచి, వేడి పెనంపై వేసి, కాల్చుకోవాలి.
6.ఒక వైపు కాలుతున్నప్పుడు, పై వైపు బటర్ పూసుకొని, బ్రెడ్ ను తిరిగేసుకోవాలి.
7. రెండు వైపులా కాలిన తర్వాత, మళ్లీ కాస్త బటర్ పూసి, బ్రెడ్ కనపడకుండా, చాక్లేట్ ను తురుము కోవాలి.
8. అంతే శాండ్ విచ్ షేప్లో కొట్ చేసుకుని సెర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News