Healthhealth tips in telugu

Drinking Water:మన బరువును బట్టి నీళ్ళు తాగాలా.. బరువును బట్టి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి..!

Drinking Water Benefits:మనం తినే ఆహారం మరియు మనం తాగే నీరు అనేవి మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మన ఆరోగ్య విషయంలో నీరు కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు సరిపడా నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియక నీటిని తాగటంలో అశ్రద్దగా ఉంటారు.

శ‌రీరంలో పేరుకు పోయిన విష ప‌దార్థాల‌ను తొల‌గించుకోవాల‌న్నా, మ‌నం తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ్వాల‌న్నా, శ‌రీరంలో వివిధ ర‌కాల జీవక్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గాల‌న్నా మ‌నం ప్రతి రోజు త‌గిన మోతాదులో నీటిని తాగ‌డం ఎంతో అవ‌స‌రం.

నీటిని తాగ‌క‌పోతే మ‌నం అనేక అనారోగ్యాల బారిన ప‌డుతామ‌న్న విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అస‌లు ఎంత బ‌రువున్న వ్య‌క్తి రోజుకి ఎన్ని లీట‌ర్ల నీటిని తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం.

45 కిలోలు బ‌రువున్న వారు నిత్యం క‌నీసం 1.9 లీట‌ర్ల నీటిని తాగాలి. అదే 50 కిలోల బ‌రువున్న వారైతే 2.1 లీట‌ర్ల వ‌ర‌కు నీటిని తాగాలి.

55 కిలోలు ఉన్న‌వారు 2.3 లీట‌ర్లు, 60 కిలోలు ఉన్న వారు 2.5 లీట‌ర్ల నీటిని తీసుకోవాలి.

65 కిలోలు ఉన్న‌వారు 2.7 లీట‌ర్లు, 70 కిలోలు ఉన్న వారు 2.9 లీట‌ర్ల నీటిని తాగాలి.

75 కిలోలు ఉన్న‌వారు 3.2 లీటర్లు, 80 కిలోలు ఉన్న వారు 3.5 లీట‌ర్ల నీటిని తాగాలి.

85 కిలోలు ఉన్న వారు 3.7 లీట‌ర్ల‌ను, 90 కిలోలు ఉన్న వారు 3.9 లీట‌ర్ల నీటిని తాగాలి.

95 కిలోల బ‌రువు ఉన్న‌వారు నిత్యం 4.1 లీట‌ర్ల నీటిని తాగాలి.

అదే 100 కిలోలు ఆ పైన బ‌రువు ఉన్న వారు 4.3 నుంచి 5 లీట‌ర్ల వ‌ర‌కు నీటిని తాగాలి.పైన చెప్పిన విధంగా ఆయా బ‌రువులు ఉన్న వ్య‌క్తులు అందుకు త‌గిన విధంగా నీటిని తాగితే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News