Kitchenvantalu

Red Rice Millet Adai:రోజూ ఒక్కటి తిన్నా చాలు పోషకాల లోపం ఉండదు..ఉత్సాహాన్ని ఇచ్చే టిఫిన్..

Red Rice Millet Adai: ఎప్పుడూ మినపప్పుతో చేసే, ఇడ్లీలు వడలు దోశలు కాకుండా, ఫైబర్ పుస్టిగా ఉండే, రెడ్ రైస్, మిల్లెట్స్ తో,అడై చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు ( నానపెట్టిన) – 1/4కప్పు
ఎర్రబియ్యం ( నానపెట్టిన) -1/4కప్పు
కొర్రలు( నానపెట్టిన) – 1/4కప్పు
ఎండుమిర్చి – 7
అల్లం – 1 ఇంచ్
వెలుల్లి – 15
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – తగినంత
సోంపు – ½ టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1
నూనె – తగినంతా

తయారీ విధానం
1.మిక్సీలో అడైకి కావాల్సిన పదార్ధాలు అన్ని వేసి, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.రుబ్బుకున్న పిండిని అవసరం అయితే, కాస్త పలచగా చేసుకోవాలి.
3.స్టవ్ పై పెనం పెట్టుకుని, వేడి చేసి, అడై పిండిని, కాస్త్ మందంగా వేసుకోవాలి.
4.పిండి వేసిన వెంటనే, ఉల్లి పచ్చిమిర్చి, సన్నని తరుగులా చల్లుకుని, అంచుల వెంట,నూనె కాని, నెయ్యి కాని వేసి, కాల్చుకోవాలి.
5. ఒక వైపు కాలిన తర్వాత అడైని, రెండవ వైపు తిప్పుకోవాలి.
6. అంతే వేడి వేడి అడై తయారైనట్లే.
Click Here To Follow Chaipakodi On Google News