Face Glow Tips:ముఖం పై ఏ సమస్యలైనా సరే.. రెండే రెండు రోజుల్లో చెక్..
Rose Water and besan Beauty Tips : ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. దానికోసం రకరకాల ప్రయోగాలు చేయటమే కాకుండా మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీమ్స్ లోషన్స్ వాడుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే వీటి వల్ల ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.
అదే ఇంటి చిట్కాలు అయితే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. అయితే కాస్త ఓపికగా చేసుకోవాలి. రోజ్ వాటర్ ని ఉపయోగించి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. రోజ్ వాటర్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఒక స్పూన్ రోజ్ వాటర్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు అన్ని తొలగిపోతాయి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉండాలి
రోజ్ వాటర్ లో కొంచెం శెనగపిండి వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్ట్ ను వారానికి రెండు సార్లు ప్యాక్ వేసుకుంటే ముఖం మీద ముడతలు అన్ని తొలగిపోయి చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనబడుతుంది.
రోజ్ వాటర్ లో కలబంద కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News