Kitchenvantalu

Vankaya Munakkaya Pulusu:ఈ వంకాయ పులుసు రుచి మరిచిపోవడానికి కొన్నేళ్లు పడుతుంది

Vankaya Munakkaya Pulusu:వంకాయతో ఎప్పుడు వేపుడు, గ్రేవీ కర్రీస్ కాకుండా,మునక్కాడతో మిక్స్ చేసి,పులుసు పెట్టేయండి.చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 6 నుంచి7
మునక్కాడ ముక్కలు – 12 -15
నూనె – 6 టేబుల్ స్పూన్స్
ధనియాల – 1 టేబుల్ స్పూన్
మిరియాలు – 1/2టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 10
పచ్చి కొబ్బరి – 1/4కప్పు
పుట్నాలపప్పు – 1 టేబుల్ స్పూన్
టమాటాలు – 3

పులుసుకోసం..
నూనె – 2 టీ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – 1/8టీ స్పూన్
ఇంగువ – 1/8టీ స్పూన్
కరివేపాకు – 3 రెబ్బలు
వెల్లుల్లి – 10 రెబ్బలు
ఎండుమిర్చి – 2
అల్లం వెల్లుల్లి వేస్ట్ – 1 టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
ఉప్పు – తగినంత
కారం – 1 టీ స్పూన్
పసుపు – 1/2టీ స్పూన్
చింతపండు- 35 గ్రాములు
నీళ్లు – 1/2లీటర్
కొత్తిమీర – చిన్నకట్ట
నెయ్యి – 1టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, మునక్కాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న వంకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి, మూత పెట్టుకుని, 10 నిముషాలు మగ్గించుకోవాలి.
2. మగ్గిన వంకాయలను, తీసి పక్కన పెట్టుకోవాలి.
3. మిగిలిన నూనెలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి.
4. అందులోకి పచ్చికొబ్బరి, పుట్నాల పప్పు వేసి, వేపుకోవాలి.
5. కొబ్బరి వేగిన తర్వాత, టమాటో ముక్కలు వేసి, మెత్తపడనిచ్చి, మిక్సీ జార్ లో వేసుకుని,మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
6. ఇప్పుడు పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, అందులో ఆవాలు, మెంతులు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని, ఫ్రై చేసుకోవాలి.

7. వేగిన తాళింపులో ఉల్లిపాయ తరుగు, రెండు చీరిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి, మగ్గించుకోవాలి.
8. ఉల్లిపాయ మగ్గిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి, ఆ తర్వాత కారం, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి వేపుకోవాలి.
9.కారం వేగిన తర్వాత, గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి, కలుపుకోవాలి.
10. ఇప్పుడు అందులోకి, వేపుకున్న మునక్కాయ , వంకాయ ముక్కలు వేసి, కలపి మూత పెట్టి, 20 నిముషాల పాటు మగ్గించాలి.
11. వంకాయ ఉడికిన తర్వాత చింతపండు పులుసు, బెల్లం, కొత్తిమీర వేసి, మరికాసేపు మరిగించాలి.
12. చివరగా నెయ్యి కాస్త కొత్తిమీర వేసి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News