Dal Coconut Chutney:పచ్చికొబ్బరితో అన్నంలోకి ఇలా పచ్చడి చేస్తే ఓముద్ద ఎక్కువే తింటారు
Dal Coconut Chutney:తియ్యటి కొబ్బరికి ,పుష్టిగా పప్పులు జోడించి రోటి పచ్చడి చేసి చూడండి.మొత్తం అన్నం పచ్చడి తోనే లాగిస్తారు.
కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – ¼ కప్పు
శనగపప్పు – ¼ కప్పు
పెసరపప్పు – ¼ కప్పు
పచ్చికొబ్బరి – ¾ కప్పు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 20-25
పచ్చిమర్చి – 5
వెల్లుల్లి – 12-15
ధనియాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ¼ టీ స్పూన్
చింతపండు – నిమ్మకాయ సైజంత
బెల్లం – 1 టేబుల్ స్పూన్
తాలింపు కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
ఇంగువ – ¼ టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి ఎండుమిర్చి,పచ్చిమిర్చి వేపుకోవాలి.
2.మిగిలిన నూనెలో మూడు పప్పులు వేసి దోరగా వేయించుకోవాలి.
3.పప్పులు వేగాకా వెల్లుల్లి,ధనియాలు,పచ్చికొబ్బరి,జీలకర్ర వేసి వేపుకోవాలి.
4.వేగిన మిశ్రమాలను జార్లో ముందుగా వేపుకున్న ఎండుమిర్చి,చింతపండు ,బెల్లం,ఉప్పు,వేసి తర్వాత పప్పులను వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
5.తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు ఎండుమిర్చి ,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు,పసుపు ఒక్కొక్కటిగా వేస్తు ఎర్రగా వేపుకోవాలి.
6.వేగిన తాలింపులో పచ్చల్లో వేసి కలుపుంకుంటే పప్పులతో కొబ్బరి పచ్చడి రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News