Beauty Tips

Hair Growth Tips: ఈ హెయిర్‌ ప్యాక్స్‌తో.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Hair Growth Tips: ఈ హెయిర్‌ ప్యాక్స్‌తో.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకోని అమ్మాయి ఉండదు. కొన్ని న్యాచురల్‌ ఫ్యాక్స్‌తో హెయిర్‌ ఫాల్‌ తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవటానికి రకరకాల హెయిర్ ప్యాక్స్, Oils ట్రై చేస్తూ ఉంటారు.

ఎన్ని రకాల ప్రయత్నం చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు చెప్పే ఆయిల్ ని ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ ఆముదం, ఒక Vitamin E Capsule ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ నూనెను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ విధంగా నూనె రాసుకుని cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చాలా తొందరగానే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఆముదంలో ఒమేగా 9 ఎసెన్సియల్ ఫాటీ యాసిడ్స్ , జెర్మీసైడల్ గుణాలు ఉండుట వలన మైక్రోబియల్, ఫంగల్ ఇన్ ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. జుట్టుకి వచ్చే ఇన్ ఫెక్షన్ల నుండి కొబ్బరి నూనె రక్షిస్తుంది. కుదుళ్ళకు కొబ్బరినూనె పోషకాలను అందించి జుట్టు రాలకుండా కాపాడుతుంది. Vitamin E ఆయిల్ కూడా జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది. Vitamin E capsule ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒక్క Capsule ధర ఒక్క రూపాయి మాత్రమే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News