Beauty Tips

Tomato For Face: ముఖంపై ఎలాంటి మచ్చలైనా పొగొట్టే టమాటా చిట్కా.. ఇలా చేశారంటే ముఖం అందంగా మెరిసిపోవాల్సిందే..!

Tomato For Face: మనలో చాలా మంది ముఖం అందంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దాని కోసం వేల కొద్ది డబ్భును ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లని మచ్చలను తొలగించుకొని ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను తొలగించటంలో టూట్ పేస్ట్ బాగా సహాయపడుతుంది. చర్మంపై తగినంత శ్రద్ద పెట్టకపోవడం,సరైన పోషకాహారం తీసుకోకపోవటం మరియు కాలుష్యం వంటి కారణాలతో మన ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ నల్లని మచ్చలను తొలగించుకోవడానికి ఒక మంచి చిట్కా ఉంది. ఆ చిట్కా కోసం టమోటా పేస్ట్,టూట్ పేస్ట్ అవసరం అవుతాయి.

టమోటాలో మంచి తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే టమోటా చర్మానికి మంచి టోన్ ని అందిస్తుంది. టమోటా మచ్చలను తగ్గించటమే కాకుండా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను తగ్గించటంలో కూడా బాగా సహాయపడుతుంది. టమోటాలో ఉండే పోషకాలు చర్మానికి పోషణను అందించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

ఒక బౌల్ లో టమోటా పేస్ట్ తీసుకోవాలి. దానిలో కొంచెం తెల్లటి టూట్ పేస్ట్ కలపాలి. టమోటా పేస్ట్,టూట్ పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. టమోటా,టూట్ పేస్ట్ లో ఉండే గుణాలు ముఖం మీద నల్లటి మచ్చలను, ముడతలను సమర్ధవంతంగా తొలగించి మంచి స్కిన్ టోన్ ని అందిస్తాయి.

ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వలన మొటిమలు,మొటిమల కారణంగా వచ్చే మచ్చలు, ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు అన్ని తొలగిపోతాయి. మసాజ్ చేయటం పూర్తి అయ్యాక పది నిముషాలు అయ్యాక ముఖహ్న్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే పేస్ట్ లో ఉండే పోషకాలు,ఇంగ్రిడియంట్స్ ముఖంపై మంచి టోన్ తీసుకువస్తాయి. అలాగే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు,మొటిమలు,వయస్సు రీత్యా వచ్చే ముడతలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా,కాంతివంతంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.