Cashew Nuts: జీడిపప్పులో ఇంత మ్యాటర్ ఉందా? ఇది చేసే మ్యాజిక్ తెలిస్తే తినకుండా ఉండలేరు!
Cashew nuts Health Benefits in telugu : ఉప్మా లేదా మసాలా వంటలు చేసినప్పుడు జీడిపప్పు తప్పనిసరిగా ఉండాలి. డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కన్నా జీడిపప్పు వాడకం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో మిగతా Dry Fruits వాడకం ఎక్కువ అయింది.జీడిపప్పు గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే జీడిపప్పును అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా కూరల్లోనూ మసాలా వంటల లోను ఉప్మా లోనూ జీడిపప్పునుఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే స్వీట్స్ లో కూడా వేస్తూ ఉంటాం. అంతేకాకుండా జీడిపప్పుతో కూడా కాజు బర్ఫీ చేసుకుని తింటూ ఉంటాం.
కాజు బర్ఫీ అంటే ఇష్టం లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనలో చాలామంది జీడి పప్పు తింటే బరువు పెరుగుతామనే భావనలో ఉండి జీడిపప్పును మానేస్తుంటారు. అయితే నిపుణులు ఇది అపోహ మాత్రమే అని అంటున్నారు.
సరైన మోతాదులో తీసుకుంటే అధిక బరువు సమస్య కు చెక్ పెట్టవచ్చు. జీడిపప్పును పచ్చిగా కాకుండా నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి. జీడిపప్పులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ సీజన్ లో వచ్చే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
జీడిపప్పులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య ఉన్నవారు ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు జీడిపప్పులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మంచి ఫలితం కనబడుతుంది. జీడిపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఓలిక్ యాసిడ్ గుండె సమస్యలు లేకుండా చేస్తాయి.
మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు కండరాలు దృఢంగా ఉండటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నవారు జీడిపప్పును మితంగా తీసుకుంటే మంచే జరుగుతుంది. కాకపోతే జీడిపప్పును నానబెట్టి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టి తింటే వాటిలో ఉన్న వంద శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News