Cabbage Kandi Pachadi: పాత కాలం నాటి క్యాబేజి కంది పచ్చడి ..వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసి తింటే..
Cabbage Kandi Pachadi:క్యాబేజ్ తో కందిపప్పు, ధనియాలు, కలుపుకుని,కమ్మని రోటి పచ్చడి చేసేద్దాం. అన్నంలో నెయ్యి, పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచే వేరు. చాలా అద్భుతంగా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
ధనియాలు – 1/2టేబుల్ స్పూన్
కందిపప్పు – 1/4కప్పు
పచ్చిమిర్చి – 6
ఎండుమిర్చి -3
పచ్చి కొబ్బరి – 1/4కప్పు
వెల్లుల్లి – 5 రెబ్బలు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
చింతపండు – నిమ్మకాయంత
క్యాబేజ్ -21/2కప్ప్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు- రుచికి సరిపడా
తాళింపు కోసం..
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
ఇంగువ – కొద్దిగా
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – 1/4టీ స్పూన్
తయారీ విధానం
1.క్యాబేజ్ ను, సన్నగా తరిగి, పది నిముషాల పాటు, స్టీమ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
2.స్టవ్ పై పాన్ పెట్టుకుని, ధనియాలు, నూనె, కందిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి,జీలకర్ర, వేసి, సన్నని సెగపై వేపుకోవాలి.
3. వేపుకున్న పదార్ధాలను మిక్సీ జార్ లో వేసి, నాన పెట్టిన చింతపండు కూడా వేసుకుని,బరకగా,గ్రైండ్ చేసుకోండి.
4.ఇప్పుడు అదే ప్యాన్ లో ఆవిరిపై మగ్గిన క్యాబేజ్ తరుగు వేసి, వేపుకోవాలి.
5.వేగిన క్యాబేజ్ ను, బరకగా గ్రైండ్ చేసుకున్న కందిపొడిలో వేసుకుని, రెండు పల్స్ తిప్పుకోవాలి.
6.స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి తాళింపు వేసుకుని, ఎర్రగా వేగిన పోపును పచ్చడిలో కలిపేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News