Potato Cheese Rings:సాయంకాలం వేళ.. అప్పటికప్పుడు రుచికరంగా చేసే ఆలు స్నాక్
Potato Cheese Rings: ముఖ్యంగా పిల్లల కోసమే కొత్త కొత్త వెరైటీ స్నాక్స్ కనిపెట్టవల్సిందే. చేసింది మళ్లీ మళ్లీ చేస్తే బోర్ ఫీలౌతారు.చేసిన పక్కకు పెట్టేస్తారు. అందుకే అప్పుడప్పుడు ఇలా వెరైటీ స్నాక్స్ ప్లాన్ చేయండి.
కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంపలు – 3
చీజ్ క్యూబ్స్ – 2
కార్న్ ఫ్లోర్ – 1 కప్పు
చిల్లీ ఫ్లెక్స్ – 1 టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 4-5
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా బంగాళదుంపలను కుక్కర్ లో పెట్టుకోని 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
2.బంగాళదుంప ఉడికిన తర్వాత దుంపలను తొక్క తీసేసి చిదిమి పెట్టుకోవాలి.
3.అందులోకి తురుమిన చీజ్ క్యూబ్లను వేసి ,తగినంత ఉప్పు ,చిల్లిఫ్లెక్స్,వెల్లుల్లి తురుము,కార్న్ ఫ్లోర్ వేసి అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
4.కొద్దిగా కొద్దిగా పిండి తీసుకోని అరచేతుల సాయంతో రోల్ చేసుకోని మద్యలో గారెల మాదిరిగా హోల్ చేసుకోవాలి.
5.నూనె వేడెక్కాక తయారు చేసుకున్న రింగ్స్ ని వేసుకోని మీడియం ఫ్లేమ్ పై ఎర్రగా కాల్చుకోవాలి.
6.రెండో వైపు తిప్పుకోని రెండు వైపులా ఎర్రగా కాలిన రింగ్స్ ని జల్లిగరిట సాయంతో ప్లేట్ లోకి తీసుకుంటే..ఆలు చీస్ రింగ్స్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News