Kitchenvantalu

Mango Chutney:మామిడికాయ పచ్చడిని కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు.. వేడి వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

Mango Chutney: మామిడికాయ అనగానే సంవంత్సరం అంతా వాడకునే నిల్వ పచ్చడి మాత్రమే చేస్తు ఉంటారు. సీజన్ లో దొరికిన మామిడి కాయలతో రోటి పచ్చడి చేసి చూడండి..టిఫిన్స్ లోకి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
పచ్చి మామిడికాయలు – 2
ఎండుమిరపకాయలు – 7-8
ఉల్లిపాయలు – 1
ఉప్పు – 1 స్పూన్
కొబ్బరి తురుము – ¼ కప్పు
వెల్లుల్లి రెబ్బలు – 4-5
జీలకర్ర – 1 స్పూన్
పసుపు పొడి – ½ టీ స్పూన్
కరివేపాకు -1/2 కప్పు
నూనె – 2 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా మామిడి కాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసుకోని అందులోకి ఎండుమిర్చివేసి వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలను కూడ వేపుకోవాలి.
4.వేగిన ఉల్లిపాయల్లో ఉప్పు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.చల్లారిన తర్వాత మిక్సి జార్ లో వేయించి మిరపకాయలు ,ఉల్లిపాయలు,జీలకర్ర,కొబ్బరితురుము,వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు మామిడికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
6.అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ చట్నీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News