Kitchenvantalu

Jonna Pindi Vadiyalu: జొన్న పిండితో వడియాలు.. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు

Jonna Pindi Vadiyalu: ప్రతిరోజు స్నాక్స్ కావాలి అనుకునేవారు. ఒకే సారి వారానికి సరిపడేలా మురుకులు చేసిపెట్టుకోండి.సరదాగా తినే స్నాక్స్ కూడ ఆరోగ్యానికి తోడ్పడేలా చూసుకోండి.అలాగైతే జొన్న పిండితో మురుకులు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
జొన్న పిండి – 1 కప్పు
పచ్చి మిరపకాయలు – 4-5
వెల్లుల్లి – 2-3
నీళ్లు – 1 కప్పు
ఉప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
నువ్వలు – 3 టీ స్పూన్స్
కారం- రుచికి సరిపడా

తయారీ విధానం
1.ముందుగా పచ్చిమిర్చి,వెల్లుల్లి మిక్సి జార్ లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
2.ఒక బాండిలో 1 కప్పు నీళ్లు పోసి కొద్దిగా నూనె యాడ్ చేసి నీళ్లను స్టవ్ పై పెట్టుకోని మరగనివ్వాలి.
3.మరుగుతున్న నీళ్లలోకి జీలకర్ర,ఉప్పు ,నువ్వులు వేసి కలుపుకోవాలి.
4.స్టవ్ లో ఫ్లేమ్ లోకి మార్చుకోని జొన్న పిండిని యాడ్ చేసి కలుపుకోవాలి.

5.పిండి ముద్దగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.కలుపుకున్న పిండిని ఐదు నిమిషాలు పక్కకు పెట్టాలి.
7.చల్లారిన పిండిని మెత్తగా మురుకుల పిండిలా కలుపుకోవాలి.
8.పిండి ముద్దను తీసుకోని వడియాల ప్రెస్ లో పెట్టుకోని వడియాలుగా నచ్చిన షేప్ లో వత్తుకోని ఎండబెట్టాలి.
9.వత్తుకున్న వడియాలను,కనీసం నాలుగు రోజుల వరకు ఎండనివ్వాలి.
10.ఎండిన వడియాలను స్టోర్ చేసి పెట్టుకోని అవసరం అనుకున్నప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసుకోని తినేయండి.
Click Here To Follow Chaipakodi On Google News