Beauty TipsHealthhealth tips in telugu

White Hair:నాచురల్‌గా మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేసుకోండిలా..చాలా సింపుల్…!

White Hair Turn Black Home remedies:ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. తెల్ల జుట్టు రాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాస్త సమయాన్ని,శ్రద్ధను పెడితే సరిపోతుంది.

బ్లాక్ టీ
బ్లాక్ టీ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు నీటిని పోసి బాగా మరిగించాలి. దానిలో రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించి ఈ మిశ్రమం చల్లారాక జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అలా వదిలేయాలి.

ఆ తర్వాత చల్లని నీటితో తల స్నానం చేయాలి. మరుసటి రోజు ఉదయం హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ టీ లో ఉన్న పోషకాలు జుట్టుకి నలుపు రంగును ఇస్తుంది. అలాగే నిర్జీవంగా మారిన జుట్టులో జీవాన్ని నింపుతుంది.

నిమ్మకాయ, కొబ్బరి నూనె తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయి. నాలుగు స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత హెర్బల్ షాంపుతో తలుస్తానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా కొత్త తెల్ల జుట్టు రావడం కూడా తగ్గుతుంది.

కరివేపాకు తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు కుడుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. అరకప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకును వేసి కరివేపాకు నలుపు రంగు వచ్చేవరకు మరిగించాలి.

ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News