Kitchenvantalu

Gongura Nuvvula Pachadi:ఆంధ్ర స్పెషల్ గోంగూర నువ్వుల పచ్చడి.. ఇలా చేస్తే రుచి అమోఘం

Gongura Nuvvula Pachadi: ఎన్ని కూరులు చేసుకున్న,ఒక్క ముద్ద చట్నీ తో తింటే ఆ ఆనందమే వేరు.చాలామంది ఇష్టంగా చేసుకునే గోంగురతో నువ్వుల చట్నీ చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
గోంగుర – 4 కట్టలు
నువ్వులు – ¼ కప్పు
పచ్చిమిర్చి – 15
నూనె – 3 స్పూన్స్
వెల్లుల్లి – తగినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
మినపప్పు – 1 స్పూన్
శనగపప్పు – 1 స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా గోంగురను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని వేడిక్కాక నువ్వులు వేసి వేపి పక్కనుంచండి.
3.అదే ప్యాన్ లో నూనే వేసుకోని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోని తీసుకోండి.
4.అదేప్యాన్ లో కడిగి పెట్టుకున్న గోంగురను వేసి ఆకు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి.

5.గోంగుర ఉడికిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.మిక్సి జార్ లోకి వేయించి పెట్టుకున్న పదార్ధాలన్నింటి తీసుకోని ఉప్పుయాడ్ చేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
7.స్టవ్ పై వేరొక బాండీ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి ఎండుమిర్చి,శనగ పప్పు,మినపప్పు,ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,పసుపు వేసి తాలింపు బాగా వేపుకోవాలి.
8.వేపుకున్న తాలింపును గ్రైండ్ చేసుకున్న గోంగుర చట్నీలో కలుపుకోవాలి.
9.అంతే ఎంతో రుచికరమైన గోంగుర నువ్వుల పచ్చడి రెడీ.