Beauty Tips

Hair Thickening Remedy: పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే పవర్ ఫుల్ రెమెడీ ఇది

Hair Growth Tips:ఈ మధ్య మారిన పరిస్థితి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా సమస్య రాగానే మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడుతున్నారు.

అలా కాకుండా ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలు హెయిర్ ఫాల్, చుండ్రు, తెల్ల జుట్టు వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు స్త్రీలనే కాకుండా పురుషులను కూడా వేధిస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటారు.

అయినా పెద్దగా ఫలితం కనబడక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాకాకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్యను, తెల్లజుట్టు,చుండ్రును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను చాలా సులభంగా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడయ్యాక రెండు స్పూన్ల Green టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడగట్టాలి. రెండు స్పూన్ల బియ్యాన్ని కడిగి నీటిని పోసి నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కలబంద ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, నాలుగు మందార పువ్వులు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమంను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో నాలుగు టీ స్పూన్ల టి డికాషన్, 4 స్పూన్ల బియ్యం నీరు, అర స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.

అలాగే తెల్ల జుట్టు కూడా తొందరగా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. చుండ్రు సమస్య, తలలో దురద వంటివి కూడా తొలగిపోతాయి. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.