Kitchenvantalu

Tandoori Corn:ఈ మసాలాతో తందూరి కార్న్ చేస్తే అద్భుతంగా ఉంటుంది

Tandoori Corn :సీజనల్ గా దొరికే మొక్క జొన్నలు అందరు ఇష్టపడుతుంటారు.కార్న్ తో ఎన్నో వెరైటీ రెసిపీస్ చేస్తునే ఉంటాం. మొక్కజొన్ననతో తందూరి ఎలా చెయ్యాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మొక్కజొన్న కోబ్స్ – 2
కారం – 1 టీ స్పూన్
ఉప్పు -1/2 టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
ఫుడ్ కలర్ – కొద్దిగా
మస్టర్డ్ ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – ½ టీ స్పూన్
చాట్ మసాలా – కొద్దిగా

తయారీ విధానం
1.మొక్క జొన్నలను పై పొట్టు తొలగించి ఒక బాండీలో పెట్టుకోని పొత్తులు మునిగేల నీరు పోసి మరిగించాలి.
2.నీళ్లు మరిగిన తర్వాత మొక్క జొన్న పొత్తులను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
3.ఉడికిన మొక్కజొన్న పొత్తులను చల్లారనివ్వాలి.
4.ఒక మిక్సింగ్ బౌల్ లోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు,కారం,ఉప్పు,జీలకర్ర పొడి,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.

5.ఇప్పుడు అందులోకి అవసరం అనకుంటే ఫుడ్ కలర్ ను కలుపుకోవాలి.
6. కలుపుకున్న మిశ్రమానికి మస్టర్డ్ ఆయిల్,నిమ్మరసం యాడ్ బాగా కలుపుకోవాలి.
7. కలుపుకున్న మిశ్రమాన్ని మొక్కజొన్న పొత్తులకు కోటింగ్ చేసుకోవాలి.
8.కోట్ చేసుకున్న పొత్తులను డైరెక్ట్ ఫ్లేమ్ పై పెట్టుకోని తిప్పుతూ అన్ని వైపులు కాల్చుకోవాలి.
9.చివరగా కాలిన పొత్తులపై కొద్దిగా బటర్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటే తందూరీ మొక్కజొన్న రెడీ.