Kitchenvantalu

Oats Khichdi:రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొడుతుందా..అయితే ఓట్స్ తో వెజ్ కిచిడీ ట్రై చేస్తే సరి

Oats Khichdi: బ్రేక్ ఫాస్ట్ కేవలం ఆకలి కోసమే కాదు ఆరోగ్యం కోసం తినాలి.ఓట్స్ తో హల్తీ బ్రేక్ ఫాస్ట్ కిచ్డీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – 1 కప్పు
పెసరపప్పు – ¼ కప్పు
టమాటోలు – 2
క్యాప్సికమ్ తురుము – 1
బంగాళదుంపలు – 2
క్యారేట్ తురుము – 1
నూనె – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 4-5
కరివేపాకు – 2 రెమ్మలు
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నీళ్లు -3 కప్పులు
పెప్పర్ పౌడర్ – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.కుక్కర్ లోకి నూనె ,నెయ్యి వేడి చేసి అందులోకి ఓట్స్ వేసి వేపుకోని పక్కనపెట్టుకోండి.
2. అదే కుక్కర్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వేడెక్కాక జీలకర్ర ,తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ,క్యారేట్ క్యాప్సికం,బంగాళదుంప ముక్కలు ,పచ్చిబఠానీలు వేసి వేపుకోవాలి.
3.మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి.
4.ఇప్పుడు అందులోకి టమాటోలు వేసి మెత్తపడే వరకు ఉడికించాలి.

5.తర్వాత కరివేపాకు,పసుపు వేసి మూడు కప్పుల నీళ్లు యాడ్ చేసి ఉప్పు మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.
6.ఇప్పుడు మరుగుతున్న ఎసరులో వేయించుకున్న ఓట్స్ వేసి కలుపుకోవాలి.
7.ఉడుకుతున్నన కిచ్డీకి మరికొంచెం నెయ్యి యాడ్ చేసి కలుపుకోవాలి.
8.చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని వేడి వేడి కిచ్డీ సర్వ్ చేసుకోవడమే.