Face Glow tips:కలబందలో కలిపి రాస్తే క్షణాల్లో మీ ముఖం మెరుస్తుంది.. మచ్చలు లేకుండా..
aloe vera Face Pack:ప్రతి ఒక్కరూ ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. దాని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ముఖం కాంతివంతంగా మెరవటానికి బంగాళదుంప,కలబంద సహాయపడతాయి.
కలబందలో విటమిన్ ఎ, సి, ఇ లు ఎక్కువగా ఉంటాయి. అలాగే బంగాళాదుంపలో ఐరన్, విటమిన్ సి, ఫాస్పరస్, పొటాషియంలు సమృద్దిగా ఉంటాయి. ఈ రెండూ కూడా చర్మ సంరక్షణలో చాలా మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి రాసుకుంటే ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బంగాళాదుంప రసంలో రిబోఫ్లేవిన్, బి విటమిన్స్ ఉండుట వలన చర్మ చాయను మెరుగుపరుస్తాయి.
బంగాళాదుంపలో అజెలైక్ యాసిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న మచ్చల్ని తగ్గిస్తుంది. మొటిమల మచ్చల్ని కూడా తగ్గిస్తుంది. కలబందలోని గుణాలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.బంగాళదుంపను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. రెండు స్పూన్ల బంగాళదుంప రసంలో ఒక స్పూన్ aloe vera జెల్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం మీద నల్లని మచ్చలు,మొటిమలు,పిగ్మంటేషన్ వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/