Beauty Tips

White Hair Turn Black:తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!

White Hair Turn Black: జుట్టు తెల్లగా మారటం అనేది ఈ మధ్య కాలంలో చాలా సాధారణం అయిపోయింది. ఒకప్పుడు కాస్త వయసు పెరిగాక జుట్టు తెల్లగా మారేది. కానీ నేటి కాలంలో చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. ఒత్తిడి, పోషకాహారం లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది.

తెల్ల జుట్టు రావటం ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే చుండ్రును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

హెన్నా కూడా తెల్లజుట్టును నల్లగా చేస్తుంది. జుట్టు రాలకుండా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుని బలంగా మార్చడంలో హెన్నా కీలకమైన పాత్రను పోషిస్తుంది.తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది. బ్లాక్ టీ కూడా జుట్టు సంరక్షణలో సహాయపడటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. సహజ కండీషనర్ గా పనిచేస్తుంది.

పొయ్యి మీద పాన్ పెట్టి పసుపు వేసి నల్లగా అయ్యేవరకు వేగించాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి బ్లాక్ టీ పొడి వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి. ఈ టీ డికాషన్ లో హెన్నా పొడి, నల్లగా వేగించిన పసుపు వేసి బాగా కలిపి గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి రెండు గంటలు అయ్యాక తలస్నానం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/