Kitchenvantalu

Aloo 65:కేటరింగ్ స్టైల్ లొ కరకరలాడే ఆలు 65 ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటాయి

Aloo 65: ఆలు తో ఏ స్పెషల్ చేసినా అదిరిపోతుంది.పెళ్లిల్ల,శుభకార్యాలాలో కనిపించే ఆలు 65 ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బంగాళదుంపలు – ½ kg
ఉప్పు – 2 టీ స్పూన్
మైదా – 2 టేబుల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర -1 టీ స్పూన్స
జీలకర్రపొడి – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
వెల్లుల్లి – 4-5 రెబ్బలు
ఎండు మిర్చి – 2
పచ్చిమిర్చి – 3
కరివేపాకు – 2 రెమ్మలు
పెరుగు – ½ కప్పు
ఫుడ్ కలర్ – చిటికెడు

తయారీ విధానం
1.శుభ్రంగా కడిగని బంగాళదుంపలను కట్ చేసుకోని ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2.చల్లారిన బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3.ఒక మిక్సింగ్ బౌల్ లోకి మైదా పిండి,బియ్యం పిండి ,కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి కారం,ఉప్పు,కొత్తిమీర ,జీలకర్రపొడి,పసుపు వేసి కాస్తా జారుగా కలుపుకోవాలి.

5.ఇప్పుడు ఉడికించిన బంగాళ దుంప ముక్కలను కలుపుకున్న పిండితో కోట్ చేసుకోని వేడి చేసుకున్ననూనెలో వేసుకోవాలి.
6.లోఫ్లేమె పై గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేపుకోని జల్లి గరిట సాయంతో తీసి ప్లేట్ వేసుకోవాలి.
7.ఇప్పుడు వేరొక ప్యాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులోకి వెల్లుల్లి రెబ్బల తరుగు,పచ్చిమిర్చి చీలికలు,కరివేపాకు వేసి వేపుకోవాలి.
8.ఇపుడు అందులోకి పెరుగు చిటికెడు ఫుడ్ కలర్ వేసి వేపుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోని బాగా వేపుకోవాలి.
9.అంతే వేడి వేడి ఆలు 65 రెడీ.