Kitchenvantalu

Veg Biryani in Cooker:కుక్కర్ లోరుచిగా,పొడి పొడి గా వెజ్ బిర్యానీ ఈజీగా చేసుకోండి

Veg Biryani Recipe: వీకెండ్స్,లో లేదంటే స్పెషల్ డేస్ లో,లేదంటే లంచ్ బాక్స్ ల్లోకి వెజ్ బిర్యానీ అయితేనే కరెక్ట్ గా సూటవుతుంది. ఈజీగా టేస్టీగా స్పెషల్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బాస్మతి బియ్యం – 2 కప్పులు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – 2 ఇంచ్ లు
యాలకులు – 3
లవంగాలు – 4
ఉల్లిపాయలు – 2
క్యారెట్లు – ½ కప్పు
పుదీనా – ¼ కప్పు
కొత్తిమీర -1/4 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్
నీళ్లు – 4 కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.బాస్మతి బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకోవాలి. నాన బెట్టుకున్న బియ్యం లో నాలుగు కప్పులు నీళ్లను యాడ్ చేసుకోవాల్సుంటుంది.
2.ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి ,నూనె వేడి చేసి అందులోకి యాలకులు ,బిర్యానీ ఆకు,దాల్చిన చెక్క,లవంగాలు వేసి వేపుకోవాలి.
3.తరువాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడకించాలి.
4.ఉల్లిపాయలు మెత్తపడ్డాక అందులోకి వెజిటెబుల్స్ వేసి మూతపెట్టుకోని ఉడకనివ్వాలి.

5.కూరగాయలు ఉడికాక కొత్తిమీర ,పుదీనా ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి.
7.ఇప్పుడు సరిపడా ఉప్పును యాడ్ చేసుకోని కుక్కర్ మూత పెట్టుకోని మూడు విజిల్స్ రానివ్వాలి.
8.ప్రెషర్ పోయిన తర్వాత వేడి వేడి వెజ్ బిర్యానీ సర్వ్ చేసుకోవడమే.