Undralla Payasam:ఉండ్రాళ్ళ పాయసం ఓసారి ఇలా చేయండి.. Extra Taste తో సూపర్ ఉంటుంది
Undralla Payasam:వినాయక చవితికి నైవేద్యాలలో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల్ల పాయసం స్పెషల్ గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అయితే వినాయక చవితి రోజునే కాకుండా మాములు రోజులలో కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయవచ్చు.
కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 1 కప్పు
బెల్లం తురుము – 1 ½ కప్పు
బియ్యం పిండి – ¼ కప్పు
ఉప్పు – చిటికెడు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – గుప్పెడు
ఎండు ద్రాక్ష – గుప్పెడు
ఎండు కొబ్బరి ముక్కలు – కొద్దిగా
యాలకుల పొడి – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.మిక్సింగ్ గిన్నెలోకి కప్పు గోధుమపిండి చిటికెడు ఉప్పు 2 టేబుల్ స్పూన్ల చక్కెడ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
2.అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుతూ ముద్దగా కలుపుకోండి.
3.కలుపుకున్న పిండిని ఇష్టమైన షేప్స్ లో తయారు చేసుకోని ప్లేట్ పై పొడి పిండి చల్లుకోని దాని పై వేసుకోవాలి.
4.ఇప్పుడు ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ,ఎండు కొబ్బరి ముక్కలు ను వేపుకోవాలి.
5.అందులోకి నాలుగు కప్పుల నీళ్లు పోసి షేప్స్ లో కట్ చేసుకున్న ఉండ్రాల్లను వేసి మీడియం ఫ్లేమ్ పై పదినిమిషాలు ఉడికించాలి.
6.ఉండ్రాల్లు ఉడికాక అందులోకి బెల్లం తురుము వేసి కరిగేవరకు ఉడకనివ్వాలి.
7.వేరొక గిన్నెలో ½ కప్పు బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుంట కలుపుకోని బెల్లం మిశ్రమంలో కలుపుకోవాలి.
8.ఉడుకుతున్న పాయసంలో యాలకుల పొడి వేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నీష్ చేసుకుంటే టేస్టీ ఉండ్రాల్ల పాయసం రెడీ.