Healthhealth tips in telugu

Know about Quinoa: అన్నం బదులు క్వినోవా తింటే షుగర్ తగ్గుతుందా? తెలుసుకోండి..

Quinoa health benefits:ఈ మధ్య కాలంలో క్వినోవా తినే వారి సంఖ్య చాలా ఎక్కువ అయింది. ముఖ్యంగా షుగర్ ఉన్న వారు ఎక్కువగా తింటున్నారు.ఒకప్పుడు క్వినోవా చాలా అరుదుగా లభించేది. కానీ ప్రస్తుతం క్వినోవా చాలా విరివిగా సూపర్ మర్కెట్స్, online store లలో అందుబాటులో ఉంటుంది. క్వినోవాలో ఉన్న పోషకాల కారణంగా ఈ మధ్య కాలంలో వీటి వాడకం కూడా చాలా ఎక్కువగా ఉంది.

క్వినోవాను మదర్‌ ఆఫ్‌ ఆల్‌ గ్రెయిన్స్ అని పిలుస్తారు. క్వినోవాతో రోటీ, ఉప్మా, పోహా, సలాడ్, సూప్‌, పాన్ కేక్, స్మూతీ ఇలా తయారుచేసుకొని తినవచ్చు. క్వినోవాను ఏ రూపంలో తీసుకున్న వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా బరువు తగ్గే ప్రణాళికలో ఉన్న వారికీ క్వినోవా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనిని తీసుకుంటే ఆక‌‌లి నియంత్ర‌ణ‌లో ఉండ‌ట‌మే కాదు.వేగంగా బ‌రువు త‌గ్గుతారు. అలాగే డయాబెటిస్ తో బాధపడే వారికీ కూడా క్వినోవా మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికీ కూడా ఎంతో మేలును చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి సమయంలో తీసుకుంటే మెద‌డు, మ‌న‌సు ప్ర‌శాంత‌గా ఉండి నిద్ర బాగా పడుతుంది.

క్వినోవాను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ప్రోటీన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య దూరం అవుతుంది.

ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్వినోవాను తీసుకుంటే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అంది ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.