Egg Bonda: బండిమీద అమ్మే కోడి గుడ్డు బోండా ఇంట్లోనే ఈజీగా …
Egg Bonda: ఎప్పుడు,ఇడ్లీ ,దోశ,వడ కాకుండా అప్పుడప్పుడు బోండా బజ్జీ లాంటి స్పెషల్స్ కూడ టిఫిన్స్ లో యాడ్ చేసుకోవాలి. బోండాలోకి ఎగ్ స్టఫ్ చేసి చేసారంటే అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
గుడ్లు – 4
శనగపిండి – ఒక కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
బంగాళ దుంప -1
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -2
కారం – 1/2 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1/2 టేబుల్ స్పూన్
అజోవాన్ – 1/4 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా – చిటికెడు
పసుపు – 1/2 టేబుల్ స్పూన్
మిరియాల పొడి – 1/4 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా గుడ్లను ఉడికించుకుని, నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండిని, బియ్యం పిండి, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, ఉప్పు, దంచిన అజోవాన్, బేకింగ్ సోడా, మరియు పసుపు వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ ముద్దలు లేకుండా పిండిని కలుపుకోవాలి.
3.ఇప్పుడు స్టఫ్పింగ్ కోసం, గుడ్డు యొక్క పచ్చ సోనాను బౌల్ లో వేసుకోవాలి.
4. ఇందులోకి ఉడకపెట్టిన బంగాళ దుంపను మ్యాష్ చేసి వాడుకోవచ్చు.
5. ఇప్పుడు మ్యాష్డ్ ఎగ్ ఎల్లో, మరియు పొటాటో మాష్ రెండిటిని మిక్స్ చేసుకోవాలి.
6.అందులోకి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, మిరియాల పొడి, మిక్స్ చేసుకుని, చాట్ మసాలా కూడా వేసుకుని, స్టఫ్పింగ్ కూడా చేసుకోవాలి.
7.ఇప్పుడు తయారు చేసుకున్న స్టఫ్ ను వైట్ ఎగ్ ను మధ్య లోపెట్టి, పిండిలో డిప్ చేసుకుని, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
8. అంతే ఎగ్ బోండా రెడీ..