Diabetes Care:షుగర్ ఉన్నవారు ఉల్లిపాయ తింటే ఏమి అవుతుందో తెలుసా?
Onion for Diabetes control in telugu : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడుతూ చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకునే ఆహారం డయాబెటిస్ మీద ప్రభావం చూపుతుంది.డయాబెటిస్ ని నియంత్రణ చేసే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
ప్రతిరోజు మనం వంటల్లో ఉల్లిపాయ వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ కూరకు రుచిని అందిస్తుంది. అలాంటి ఉల్లిపాయ డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వేసుకోవాల్సిందే.
డయాబెటిస్ నియంత్రణ చేసే ఆహారాలను తీసుకుంటే .డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను తింటే మంచిది. ఉల్లి పాయలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండుట వలన తక్కువ కార్బో డైట్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఫైబర్ విచ్ఛిన్నమై జీర్ణమయ్యేటప్పుడు, రక్తప్రవాహంలోకి చక్కెర విడుదలను ఆలస్యం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఉండే మలబద్దకం సమస్యను కూడా ఉల్లిపాయ తగ్గిస్తుంది. ఉల్లిపాయ గ్లైసెమిక్ సూచిక 10 కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి సరైన ఆహారం అని చెప్పవచ్చు. 55 కన్నా తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలు చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి.
అలాగే డయాబెటిస్ కారణంగా వచ్చే అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగిస్తుంది. కాబట్టి ఉల్లిపాయను తింటే డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. కాబట్టి ఉల్లిపాయను తినటానికి ప్రయత్నం చేయండి. ఉల్లిపాయలు సంవత్సరం పొడవునా చాలా విరివిగా లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/