Kitchenvantalu

Instant Pizza:ఒవేన్ లేకుండా ఇంట్లో వున్నా వాటి తోనే పిజ్జా.. చాలా సింపుల్..

Instant Pizza: మారుతున్న కాలంలో పిల్లలు పిజ్జాలు,బర్గర్ లకి అలవాటు పడిపోయారు. ఎక్కువ చీజ్ ,ఫ్యాట్స్ వుండే ఇలాంటి ఫుడ్స్ తినడం అంత మంచిది కాదు. కాబట్టి చీజ్ లేకుండానే పిల్లలకు ఇన్ స్టంట్ గా పిజ్జాని ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 1 కప్పు
బేకింగ్ పౌడర్ – ½ టీ స్పూన్
బేకింగ్ సోడా -1/4 టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
చక్కెర – ½ టీ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
పెరుగు – 1 కప్పు

తయారీ విధానం
1.పిజ్జా బేస్ కోసం ఒక గిన్నెలో కప్పు మైదా పిండిని ,బేకింగ్ పౌడర్ కలుపుకోవాలి.
2.అందులోకి బేకింగ్ సోడా ,ఉప్పు,చక్కెర ,స్పూన్ ఆయిల్ వేసి అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి పెరుగు,అవసరం అయితే నీళ్లు వేసుకోని ముద్దలా,మెత్తగా కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండిని అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి.
5.ఇప్పుడు సాస్ కోసం మూడు టేబుల్ స్పూన్స్ టమాటో సాన్ తీసుకోని అందులోకి తరిగిన వెల్లుల్లి మిరపకాయలు వేసి కలుపుకుంటే రెడ్ సాస్ రెడీ.
6.ఇప్పుడు వైట్ పిజ్జా కోసం ప్యాన్ లో టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగించుకోని అందులో టేబుల్ స్పోన్ మైదా వేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి.
7. ఒక నిమిషం పాటు వేగాక అందులోకి వెల్లుల్లి తరుగు ,పాలు వేసుకోని కలుపుతూ ఐదారు నిమిషాల పాటు మరిగించాలి.
8.అందులోకి మిరియాలపొడి,ఉప్ఉప వేసి కలుపుకుంటే వైట్ సాస్ రెడి అయినట్టే.
9.ఇప్పుడు పిజ్జా బేస్ కోసం రొట్టెను కాల్చుకోవాలి.

10.కలుపుకున్న పిండి ముద్దను మందపాటి రొట్టెలాగా స్ప్రెడ్ చేసి నూనె పూసిన ప్లేట్ లో వేసుకోవాలి.
11.పిజ్జా బేస్ ను ఫోర్క్ సాయంతో గుచ్చుకోవాలి.
12.ఇప్పుడు దాని పై రెడ్ సాస్ వేసి బేస్ మొత్తం పై స్ప్రెడ్ చేయాలి.
13.ఆపై వైట్ సాస్ ను కూడ అప్లై చేసుకోవాలి.
14.దాని పై క్యాప్సికం,ఉల్లిపాయలు,టమాటోలు,కార్న్ నచ్చినట్టుగా ట్యాపింగ్ చేసుకోవచ్చు.
15.ట్యాపిగ్ చేసుకున్న తర్వాత వాటిపైన సాస్,చిల్లి ఫ్లేక్స్,ఓరిగానో,మిరియాల పొడి,నచ్చిన మసాలాలు జోడించాలి.
16.ఇప్పుడు బేక్ చేయడం కోసం మందపాటి బాండిని బాగా వేడి చేసి ఆపై బాండి అడుగున ఒక స్టాండ్ ఏర్పాటు చేసి,స్టాండ్ పై పిజ్జా ప్టేట్ పెట్టుకోవాలి.
17.లో ఫ్లేమ్ పై పదిహేను నుండి ఇరువై నిమిషాలు కాల్చుకోవాలి.
18.అంతే పదిహేను నిమిషాల తర్వాత పిజ్జాను తొలగించి కట్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.