Kitchenvantalu

Barley Kheer Recipe:ఇంట్లో బార్లీ ఖీర్ రెసిపీ తయారీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Barley Kheer Recipe: స్పెషల్ అకేషన్స్ స్పెషల్ రెసిపీస్ చేస్తేనే త్రిల్ ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ తల్బీనా డిజెర్ట్ ఎప్పుడైన టేస్ట్ చేసారా.

కావాల్సిన పదార్ధాలు
బార్లీ గింజలు – 4 టేబుల్ స్పూన్స్
పాలు – 1 లీటర్
డేట్స్ – 10-12
తేనే – 2 టేబుల్ స్పూన్
యాలకుల పొడి ½ టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా బార్లీ గింజలను నాలగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.ఖర్జూరాల నుంచి విత్తనాలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3.ఖర్జూరం తో పాటు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వాడచ్చు.
4.ప్యాన్ పాలు పోసి వేడి చేసుకోవాలి.మరిగిన పాలలో నానబెట్టుకున్నన బార్లీ గింజలను వేసి లో ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.

5.అడుగు మాడ కుండా కలుపుతూ అరగంట పాటు ఉడకనివ్వాలి.
6.బార్లీ సగం ఉడికిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి పాలు చిక్క పడే వరకు ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవలి.
7.ఇప్పుడు అందులోకి తేనేను వేసి కలుపుకోవాలి.
8.అంతే టేస్టీ టేస్టీ తల్బీనా రెసిపీ రెడీ.