BusinessKitchenvantalu

Masala Coffee:మసాలా రుచితో కాఫీని ఎప్పుడైనా తాగారా.. ఇది మీ కోసమే..

Masala Coffee: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే రోజంతా హుషారుగా ఉంటుంది. పొగలుగక్కుతూ చిక్కని నురగతో వచ్చే కాఫీ తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. కాఫీలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ‘మసాలా కాఫీ’ అందుబాటులో ఉంది.

ఈ కాఫీ పొడిని కాఫీ గింజలతోపాటు శొంఠి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వంటివన్నీ మోతాదు ప్రకారం తీసుకుని తయారుచేస్తారు. ఈ పొడిని పాలతోనూ కలిపి తీసుకోవచ్చు లేదా బ్లాక్కాఫీ రూపంలోనూ తాగొచ్చు. మసాలా టీ మాదిరి ఈ కాఫీ కూడా ఘాటుతో, అదే రుచితో ఉంటుంది. జలుబు, దగ్గు లాంటివి ఉన్నప్పుడు… ఒక కప్పు తాగితే చాలు.