Healthhealth tips in telugu

Junnu Benefits: జున్ను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఎంటో తెలుసా..?

Junnu health benefits in telugu:పాల నుంచి తయారయ్యే అద్భుతమైన స్వీట్ జున్ను. జున్నును ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు. దూడను ప్రసవించిన రోజు తల్లి ఆవు లేదా గేదె ఇచ్చే పాలతో జున్నును తయారుచేస్తారు. పంచదార లేదా బెల్లం, యాలకుల పొడి కలిపి తయారుచేస్తారు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన జున్ను.. రుచిలోనే కాదు,ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారి కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి.

అప్పుడే మనం ఏ పని చేయాలన్నా నొప్పులు లేకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కాల్షియం, విటమిన్ డి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఇవి సమృద్దిగా లభించే ఆహారం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే చాలా రుచిగా ఉండే జున్ను ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

జున్నులో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. జున్ను తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా మలబద్ధకం తగ్గుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండే జున్నును తగిన మోతాదులో తీసుకుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. దాంతో రోజంతా హుషారుగా ఉంటారు. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

జున్నులో ఇమ్యునోగ్లోబిన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఏజింగ్ ప్రక్రియను అడ్డుకునే శక్తి జున్నులో ఉంది. చర్మాన్ని మెరిసేలా చేయడం, ముడతలు, నల్లటి వలయాలు, గీతలు కనిపించకుడా నిరోధిస్తుంది. చర్మానికి తేమను కూడా అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.