Kitchenvantalu

Kakarakaya Mamidikaya Curry:చేదు లేకుండా కాకరకాయ మామిడికాయ కర్రీ ఒక్క సారి ఇలా ట్రై చేయండి

Kakarakaya Mamidikaya Curry:రుచికి చేదైనా, ఆరోగ్యంలో ఎంతో మైలేనా,కాకరకాయను మామిడికాయ పులుపుతో జోడించి, కూర చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – 1/4 కిలో
మామిడికాయ -1
కారం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – 1/2 టేబుల్ స్పూన్
తురిమిన బెల్లం – 1 టేబుల్ స్పూన్
శనగపిండి – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 3
పచ్చిమిర్చి -2
వెల్లుల్లి రెబ్బలు – 4
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు -3

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, తురిమిన మామిడికాయ ముక్కలు,కాకరకాయ ముక్కలు, కారం, ఉప్పు, బెల్లం, వేసి కలుపుకుని, స్టవ్ ఆన్ చేసి, మూత పెట్టుకుని, ఉడికించాలి.
2. స్టవ్ ఆఫ్ చేసి, వేరొక బాండీలో నూనె వేసుకుని, అందులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి.
3. అవి వేగిన తర్వాత, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, వేసుకుని, ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఉడికించాలి.
4. ఇప్పుడు అందులోకి, ఉడికించుకున్న కాకరకాయ , మామిడికాయ ముక్కలు వేసి, కాసేపు వేపుకోవాలి.
5. ఇప్పుడు అందులోకి నువ్వుల పొడి వేసుకుని, బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.