Kitchenvantalu

Tomato Kothimeera Pachadi:వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసి కాసింత నెయ్యి తగిలించి తింటే..

Tomato Kothimeera Pachadi: వేడి వేడి అన్నంలో రోటీ పచ్చడి , కాసింత నెయ్యి యాడ్ చేసుకుని తింటే, ఆ కిక్కే వేరు. కొత్తిమీరతో టమాటో పచ్చడి, తయారీ విధానం చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
టమాటా – 1/2 కిలో
ఉప్పు – తగినంత
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండుమిరపకాయలు – 4
ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
తురిమిన బెల్లం – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – ఒక కప్పు
పచ్చిమిర్చి – 4
చింతపండు -20 గ్రాములు
శగనపప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 8 రెబ్బలు

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులోకి, ఎండుమిర్చి, శగనపప్పు, కొత్తిమీర వేసి, రంగుమారే వరకు వేపుకోవాలి.
2. ఇప్పుడు అందులోకి, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి, మూత పెట్టి మెత్తగా ఉడికించాలి.
3. ఉడుకుతున్న టమాటాలో , ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.
4. ఉడికిన టమాటో మిశ్రమం, చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లోకి, వేసుకుని, అందులోకి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, బెల్లం, వేసుకుని, గ్రైండ్ చేసుకోవాలి.
5. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
6. ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి, వేగిన తాళింపును, పచ్చడిలో వేసుకోవాలి.
7. అంతే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ.