Beauty Tips

White Hair:ఈ తొక్కలతో ఇలా చేస్తే చాలు.. మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి..

White HAir:తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతున్నారు.

వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

తెల్ల జుట్టు సమస్యను తగ్గించటానికి సొరకాయ చాలా బాగా సహాయపడుతుంది. మనం సొరకాయతో కూర చేసుకున్నప్పుడు తొక్కను పాడేస్తూ ఉంటాం. సొరకాయ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకొని పక్కన పెట్టాలి. ఈ పొడి సంవత్సరం నిల్వ ఉంటుంది.

ఆ తర్వాత బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను వేసుకుని వేడి చేయాలి. ఇలా వేడిచేసిన కొబ్బరి నూనెలో ముందుగా సిద్ధం చేసుకున్న సోరకాయ పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ నూనెను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి.

ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టిస్తూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా ..ప్రతి రోజు సోరకాయ జ్యూస్‌ తాగటం వల్ల కూడా శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సొరకాయలో ఉండే నీటి శాతం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయలో మాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, రిబోఫ్లావిన్, థియామిన్, పాంతోతేనిక్ యాసిడ్ , విటమిన్ బి6 , నియాసిన్ , ఫోలేట్ , శక్తి ఉంటాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్‌ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.