Face Glow Tips:రోజ్ వాటర్‌తో ఇలా చేస్తే.. మీ ముఖం క్లీన్.. మీ లుక్ ఎవర్‌గ్రీన్!
Rose water For Face:ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయితే మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా కాంతివంతమైన ముఖాన్ని పొందవచ్చు.
ఒక గిన్నెలో 2 నుండి 3 స్పూన్ల రోజ్ వాటర్ మరియు 2 నుండి 4 చెంచాల పచ్చి పాలు కలపండి. ఆ తర్వార అర స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి.
10 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి కనీసం 2 నుండి 3 సార్లు వేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. Rose water చర్మం యొక్క pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది ముఖంపై టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
పచ్చి పాలలో విటమిన్ ఎ ఉండుట వలన చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.ఇది చర్మానికి తేమను అందిస్తుంది. కాఫీ పొడి చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ చర్మాన్ని డీప్ క్లీన్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ ప్యాక్ లో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించి ఈ ప్యాక్ వేసుకొని తెల్లని మెరిసే అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.