Beauty Tips

Hair Care Tips: చలికాలంలో పొడిబారిన మరియు నిర్జీవమైన జుట్టు స్మూత్ అండ్ సూపర్ సిల్కీగా మారాలంటే..

Hair Care Tips:ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి, వాతావరణంలో కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

చలికాలంలో పొడిబారిన మరియు నిర్జీవమైన జుట్టు స్మూత్ అండ్ సూపర్ సిల్కీగా మారాలంటే.. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక పాన్లో రెండు కప్పుల నీరు,రెండు చెంచాల మెంతులు, రెండు చెంచాల బియ్యం, రెండు చెంచాల టీ ఆకులను వేసి.. మూడు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు మరిగించాలి.

ఆ తర్వాత నీటిని వడపోసి గిన్నెలో ఉంచుకోవాలి.ఇప్పుడు గిన్నెలో రెండు ప్యాకెట్ల హెన్నా పౌడర్ వేయాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత, రెండు కలబంద జెల్ ఆకులను కట్ చేసి.. జెల్ ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు అలా వదిలేయాలి.

జుట్టును శుభ్రం చేసుకున్నా తర్వాత మాత్రమే ఈ ప్యాక్ రాయాలి. ఎందుకంటే జుట్టుకు నూనె ఉంటే ఈ ప్యాక్ జుట్టుకు పట్టదు. జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేయాలి.

ఈ మాస్క్‌లో కలబంద ఉండుట వలన తలలో వేడిని తగ్గిస్తుంది. హేన్నాలో మంచి రంగు కోసం టీ ఆకు రంగు ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతులు మరియు బియ్యం జుట్టు పెరుగుదలకు మరియు మెరుపుకు మేలు చేస్తాయి.

కాబట్టి ఈ ప్యాక్ వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు బాగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.