Kodo Millets Benefits :శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంతో పాటు, షుగర్ కు మేలు చేసే అరికెలు !
Kodo Millet Health benefits In telugu : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి ప్రతి ఒక్కరు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో బాగంగా చిరు ధాన్యాలను ఆహారంలో బాగంగా చేసుకుంటున్నారు.
ఈ రోజు చిరు ధాన్యాలలో ఒకటైన అరికెలు గురించి తెలుసుకుందాం. తీపి, వగరు,చేదు రుచి కలిగిన అరికెలలో యాంటీ ఆక్సిడెంట్స్,ఫైబర్,vitamins,మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. అరికెలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నీరసంను కూడా తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య కనపడుతుంది.
అరికెలను ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గటమే కాకుండా రక్తం శుద్ది కూడా అవుతుంది. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని కూడా కరిగిస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.
ఎముకలు,కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిద్ర లేమి సమస్య కూడా తగ్గుతుంది. కంటి నరాలు బలంగా ఉండేలా చేసి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి రక్తప్రవాహం బాగా సాగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.