Kitchenvantalu

Madatha Kaja:మడత కాజాని ఇలా చేస్తే పొరలు పొరలుగా జ్యూసీగా వస్తుంది

Madatha Kaja: స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు, అందులోనూ కాకినాడ ఫేమస్ మడత కాజాలు, ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మైదాపిండి – ½ కేజీ
నెయ్యి – 50 గ్రాములు
బేకింగ్ సోడా – ½ టేబుల్ స్పూన్
చక్కర – 1 కేజీ
పట్టిక – చిటికెడు

తాయరీ విధానం
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి, మైదా వెన్న, లేదా నెయ్యి వేసి, అందులోకి, బేకింగ్ సోడాను కలిపి, అవసరం అయినన్ని నీళ్లు కలుపుతూ ముద్దగా కలుపుకోవాలి.
2. కలుపుకున్న పిండి ముద్దను అరగంట పాటు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి.
3.ఇప్పుడు షుగర్ సిరప్ కోసం, ఒక కేజీ పంచదార, నీటిని కలిపి, చక్కర పూర్తిగా కరిగేవరకు, కలుపుకోవాలి.
4.అందులోకి పట్టికను కూడా యాడ్ చేసుకోవాలి.
5. పాకాన్ని కలుపుతూ కాస్త చిక్కబడిన తర్వాత స్టౌను ఆఫ్ చేసుకోవాలి.

6.ఇప్పుడు పక్కన పెట్టుకున్న్ పిండిని సన్నని, షీట్ లాగా తాల్చుకోవాలి.
7. పొడి పిండి చల్లుకుంటూ సగానికి మడుచుకుని, అంచులను ఫోల్డ్ చేసుకుంటూ, ఒక వైపు కు మలుచుకోవాలి.
8. మడుచుకున్న కాజాను చివర్లో నీరు చల్లి పిండిని అతికించుకోవాలి.
9.రోల్ చేసుకున్న కాజాలను సగానికి కత్తిరించుకుని, ఎడ్జ్ లను క్లోజ్ చేసుకోవాలి.
10. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసి అందులోకి , మీడియం ఫ్లేమ్ లో , కాజాలను వేసుకోవాలి.
11. గోధుమరంగు వచ్చేవరకు వేయించుకుని, కాలిన కాజాలను, చెక్కర పాకంలో వేసుకోవాలి.
12. పాకంలో పది నిముషాలు నానిన తర్వాత, కాజాలను వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి.
13.అంతే జ్యూసీ జ్యూసీ మడతకాజాలు తయార్.