White Hair: చిన్న వయసులోనే జుట్టు తెల్లగా ఉందా..? మీ సమస్యకు ఇదిగో పరిష్కారం
White Hair Turn Black: తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే కనిపిస్తుంది. తెల్లజుట్టు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అశ్వగంధను ఉపయోగించవచ్చు. అశ్వగంధలో టైరోసిన్ ఉంటుంది, ఇది ఒక రకమైన అమైనో ఆమ్లం. ఈ యాసిడ్ శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లజుట్టు సమస్య వస్తుంది.
ఒక బౌల్ లో 2 టీస్పూన్ల అశ్వగంధ పొడికి వేడి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత, తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేయాలి.
అశ్వగంధ పొడి ఆయుర్వేదం షాప్ లలోను, online స్టోర్స్ లో చాలా సులభంగా దొరుకుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి తెల్లజుట్టు సమస్య నుండి బయట పడండి. అలాగే జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.