High Blood Pressure:వెల్లుల్లితో నిజంగానే బీపీని కంట్రోల్ చేయవచ్చా.. నిజాన్ని తెలుసుకోండి
Garlic benefits in telugu :ప్రస్తుతం మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవటం,ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అధిక రక్త పోటు సమస్యతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్తపోటు సమస్య వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
అలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి రక్తపోటును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి వెల్లుల్లిని రక్తపోటు తగ్గించే ఔషధంగా వాడుతున్నారు. వెల్లుల్లి ఎలా తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి వెల్లుల్లిని చాలామంది ఉడికించి తీసుకుంటూ ఉంటారు.
ఉడికించడం వలన వెల్లుల్లిలో ఉండే అలిసిన్ క్రియారహితం అవుతుంది. పచ్చి వెల్లుల్లి తింటే దానిలో ఉండే అలిసిన్ అనే రసాయనం రక్తపోటును తగ్గిస్తుంది. రోజుకి ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తినకూడదు. అలాంటి వారు పచ్చి వెల్లుల్లిని వేడి వేడి అన్నంలో పెట్టి ఒక నిమిషం అయ్యాక తినవచ్చు.
వెల్లుల్లి తినటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉండి రక్తప్రవాహం బాగా సాగి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడతారు.
వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతు నొప్పి, జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో మన వంటింటిలో ఉండే వస్తువులతో ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.