Beetroot Mamidikaya Pachadi:అన్నములోకి చాలా రుచిగా ఉండే ఆంధ్రా స్టైల్ బీట్ రూట్ మామిడికాయ పచ్చడి..
Beetroot Mamidikaya Pachadi: ఆంధ్ర స్టైల్ బీట్ రూట్ ఊరగాయ పచ్చడి.ఆరోగ్యానికి మేలు చేసే బీట్ రూట్ తో మామిడికాయ మిక్స్ చేసి పచ్చడి చేసారంటే రుచి అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
బీట్ రూట్ -1
మామిడి కాయ – 1
ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్
కారం – 2 టేబుల్ స్పూన్స్
శగనపిండి – 3 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టేబుల్ స్పూన్
ఎండు మిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా మామిడికాయ,బీట్ రూట్ ను తురిము ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
2.అందులోకి ఉప్పు,కారం ,శనగ పిండి వేసి కలుపుకోవాలి.
3.ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి మినపప్పు,శనగ పప్పు,ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు వేసుకోవాలి.
4.వేపుకున్న తాలింపును కలిపిపెట్టుకున్న బీట్ రూట్,మామిడికాయ మిశ్రమంలో కలుపుకోవాలి.