Sweet Potato Gulab Jamun:కేవలం చిలకడదుంపతో నోట్లోవేయగానే కరిగిపోయే గులాబ్ జామున్ చేసుకోండి
Sweet Potato Gulab Jamun: అందరు ఇష్టపడే స్వీట్ గులాబ్ జామూన్స్. స్వీట్ పొటాటోస్ తో గులాబ్ జామ్స్ ఎప్పుడైనా ట్రై చేసారా.లేదంటే ఈ సారీ ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
స్వీట్ పొటాటోస్ – 3
బేకింగ్ సోడా – చిటికెడు
యాలకులు పొడి – 1.5 టేబుల్ స్పూన్
చక్కెర – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్
నీళ్లు – 1 కప్పు
తయారీ విధానం
1.ముందుగా చిలగడ దుంపలను ఆవిరి మీద ఉడికించి పొట్టు తీసి మాష్ చేసి పెట్టుకోవాలి.
2.అందులోకి చిటికెడు బేకింగ్ సోడా,యాలకుల పొడి వేసి రెండు టేబుల్ స్పూన్స్ మైదా వేసి కలుపుకోవాలి.
3.ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి జామూన్ తయారు చేసుకునేలా మిశ్రమాన్ని కలుపుకోవాలి.
4.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ నూనె వేసుకోని పిండిని బాల్స్ ల తయారుచేసుకోని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
5.వేపుకున్న జామున్ లను పక్కన పెట్టుకోవాలి.
6.ఇప్పుడు సిరప్ కోసం ఒక గిన్నెలోకి చక్కెర ,నీళ్లను కలిపి ఐదారు నిమిషాలు మరగించాలి.
7.సిరప్ మరిగిన తర్వాత అందులోకి యాలకుల పొడి కలుపుకోవలి.
8.ఇప్పుడు తయారు చేసుకున్న జామున్ లను షుగర్ సిరప్ లో వేసుకోని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి.
9.పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్వీట్ పొటాటో గులాబ్ జామ్స్ రెడీ.