Beauty Tips

Teeth Whitening : ఇలా చేస్తే పళ్ళపై పసుపు మరకలు పోయి తెల్లగా మెరుస్తాయి..

Yellow Teeth Home Remedies:ముఖానికి అందం దంతాలు. దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటే ఆ అందమే వేరు. కొంత మంది దంతాలు ఎంత శుభ్రం చేసుకున్నా గార పట్టి పసుపు రంగులో ఉంటాయి.

కొంత మంది దంతాలు ఎంత శుభ్రం చేసిన సరే పసుపు రంగులోకి మారతాయి. అలాగే గార పడుతూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. దాంతో నిరాశ చెంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.

లవంగాలు, ఆలివ్ నూనె పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చటమే కాకుండా నోటిలో బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసన లేకుండా చేస్తాయి. ఒక స్పూన్ ఆలివ్ నూనెలో ఒక స్పూన్ లవంగాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పంటి మీద గార,పసుపు రంగు తొలగిపోతాయి. పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పళ్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

లవంగాలలో యాంటీ జింజివిటిస్, యాంటీప్లేక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, మంట, నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. అలాగే దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తాయి.

ఆలివ్ నూనె కూడా దంతాలు తెల్లగా రావటానికి సహాయపడుతుంది. ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మార్చుకోవచ్చు. మీరు కూడా ఈ చిట్కా ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.