Chintakaya Pachadi : వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడిని కలిపి తింటే.. వచ్చే మజాయే వేరు..!
Chintakaya Pachadi:తెలుగు వారి భోజనం అంటేనే మొదటి ముద్ద పచ్చడితో మొదలౌతుంది. రెగ్యులర్ గా కాకపోయిన సీజన్ లో పచ్చిచింతకాయ పచ్చడి తప్పకుండా చేసుకుంటాం. పచ్చి చింతకాయ పచ్చడి పచ్చిమిర్చి తో కలిపి ఎలా చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
చింతకాయలు – 400 గ్రాములు
పచ్చిమర్చి – 3-5
వెల్లుల్లి రెబ్బలు – 7-8
బెల్లం – 2 టేబుల్ స్పూన్
జీలకర్ర – 2 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి -2
కరివేపాకు – 1 కప్పు
పసుపు – ½ టేబుల్ స్పూన్
ఉప్పు ½ టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.చింతకాయలను బాగా కడిగి ఆరబెట్టుకోని కాడలు తీసి పక్కన పెట్టుకోవాలి.
2.అలాగే పచ్చిమిర్చి ,కొత్తిమీర,వెల్లుల్లి రెబ్బలు ,బెల్లం,జీలకర్ర ఆరబెట్టుకున్న చింతకాయలను మిక్సి జార్ లో వేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
3.ఇప్పుడ తాలింపు కోసం స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేసుకోని అందులోకి ఆవాలు,జీలకర్ర ,శనగపప్పు వేసి రంగుమారే వరకు వేపుకోవాలి.
4.అందులోకి బరకగ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు,ఎండుమిర్చి ,పసుపు కూడ వేసుకోవాలి.
5.ఇప్పుడు వేపుకున్న తాలింపులోకి చింతకాయ చట్నీని వేసి కలుపుకోవాలి.