Kakarakaya Kaaram:కాకరకాయ కారం పొడి ఒక్కసారి ఇలా చేస్తే చేదు లేకుండా కమ్మగా రోజు తినేయచ్చు
Kakarakaya Kaaram: రుచిలో చేదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయలు ఎలా చేసుకున్న రుచిగానే ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి కాకరకాయం కారం ఎలా తయారు చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
కాకరకాయ – ½ kg
ఎండుమిర్చి – 7-8
మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్
శనగపప్పు – 3 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్
వెల్లల్లి రెబ్బలు – 20
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
చింతపండు – 20 గ్రాములు
పసుపు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను పై పొట్టిచాప్ చేసుకోని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి వేడెక్కాక మినపప్పు,శనగపప్పు,ధనియాలు వేసి వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
3.అదే బాండీలో ఎండుమిర్చి వేసి వేపి పక్కన పెట్టుకోవాలి.
4.అదే బాణీలో కాకరకాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
5.అందులోకి ఉప్పు వేసి మీడియం మంటపై బాగా వేపుకోవాలి.
6.మిక్సి జార్ లోకి ముందుగా వేపుకున్న పప్పును,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,ఉప్పు,వేపుకున్న ఎండుమిర్చి ,చింతపండు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
7.వేపుకున్న కాకరకాయ ముక్కలలో గ్రైండ్ చేసుకున్న పొడిని కలుపుకోని బాగా మిక్సి చేసుకుని కంటేనర్ లో స్టోర్ చేసుకోని రెండు వారలా వరకు యూజ్ చేసుకోవచ్చు.