Skin Care Tips:దీపావళి రోజు ముఖం అందంగా మెరవాలంటే..సింపుల్ రెమెడీ..
Alovera And Multhani Mitti Face Glow:ప్రతి ఒక్కరూ ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా పెద్దగా పలితం రాక ఎంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు.
మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multhani Mitti ) వేసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) అర స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ ప్యాక్ లో తీసుకున్న అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు ముఖ సంరక్షణలో సహాయపడతాయి. అలాగే చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.