Kitchenvantalu

Menthula Kura:పిల్లలకి పాలిచ్చే తల్లులు, జుట్టు ఎక్కువగా రాలుతున్న వాళ్ళు తినాల్సిన మెంతుల కూర

Menthula Kura: ఆరోగ్యానికి ,అరుగుదలకు ఎంతో మేలు చేసే మెంతులను ప్రతి వంటలో వాడుతుంటాం. కాని మెంతులతో కూర ఎప్పుడైన ట్రై చేసారా.లేదంటే ఇప్పుడే చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
మెంతులు – 3-4 టేబుల్ స్పన్స్
వెల్లుల్లి రెబ్బలు – 10-12
పచ్చిమర్చి – 2
మిరియాల పొడి – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – ¼ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
కరివేపాకు – కొద్దిగా
కారం – ½ స్పూన్

తయారీ విధానం
1.మెంతులను శుభ్రంగా కడిగి రాత్రంత నానబెట్టుకోవాలి.
2.పొద్దున మెంతులను వడకట్టుకోని నీళ్లను పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనే వేడి చేసి అందులోకి తరగిన వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,ఆవాలు,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేపుకోవాలి.
4.అందులోకి నానిన మెంతులను వేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి.

5.ఇప్పుడు ఉప్పు,పసుపు వేసి కలుపుకోని పక్కన పెట్టుకోని మెంతి నీళ్లు రెండు గ్లాసుల వరకు పోసి మరగినివ్వాలి.
6.నీరు మొత్తం ఇగిరి పోయే వరకు ఉడకించాలి.
7.ఉడికిన మెంతి కూరలోకి కారం,ధనియాల పొడి వేసి లోఫ్లేమ్ పై మగ్గించాలి.
8.మెంతి కూర దగ్గరపడ్డాకా కొత్తిమీర తరుగు చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మెంతుల కూర రెడీ.