Kitchenvantalu

Thapala Chakka: ఈవినింగ్ స్నాక్స్ కి వీటిని చేసి చూడండి.. సూపర్ గా ఉంటాయి

Thapala Chakka: తెలంగాణ స్పెషల్ సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కి క్యాబేజి తురుముతో సర్వపిండి ఎలా తయారు చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 2 కప్పులు
క్యాబేజి -1 ½ కప్పు
ఉల్లిపాయలు – 1
నువ్వులు – 2 టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
శగనపప్పు – 3 టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ 1 ½ టీ స్పూన్
కొత్తమీర – ¼ కప్పు

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి క్యాబేజి మరుయు ఉల్లిపాయ తురుము వేసుకోవాలి.
2.అందులోకి బియ్యం పిండి ,నువ్వులు,కొత్తిమీర జీలకర్ర,ఉప్పు,పచ్చిమిర్చి పేస్ట్,నీళ్లు కలపకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.
3.క్యాబేజి ,ఉల్లిపాయ తేమతో బియ్యం పిండి ముద్దలా తయారవుతుంది.లేదంటే కాసిన్ని నీళ్లు యాడ్ చేసుకోని మెత్తని ముద్దలా తయారుచేసుకోవాలి.
4.ఇప్పుడు మందపాటి బేస్ ఉన్న గిన్నె,లేక కడాయి తీసుకోని అడుగును నూనె తో కోట్ చేయాలి.

5.కొద్దిగా పిండి ముద్దను తీసుకోని గిన్నె అడుగు బాగంలో కాస్త పల్చగా వత్తుకోవాలి.
6.వత్తుకున్న ప్యాన్ ను మీడియం ఫ్లేమ్ పై పెట్టుకోని నెమ్మదిగా తిప్పుతు కాల్చుకోవాలి.
7.రెసిపి రెడి అవ్వడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది.
8.ఎర్రగా కాల్చుకున్న క్యాబేజి సర్వపిండిని వేడిగా కాని ,చల్లారిన తర్వాత కూడ సర్వ్ చేసుకోవచ్చు.