Kitchenvantalu

Dondakaya 65 Recipe:కేటరింగ్ వాళ్ళు చేసే క్రిస్పీ దొండకాయ 65 Simple గా ఇంట్లోనే చేసుకోండి

Dondakaya 65 Recipe: పెళ్లిల్లో చేసుకునే దొండ కాయ 65 నే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.అచ్చం ఫంక్షన్ స్టైల్ టేస్ట్ తో దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు – ¼ kg
శనగపిండి – 2 టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్
కారం – 1 టీస్పూన్
ఉప్ఉ ¾ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
పల్లీలు – 2-3 టేబుల్ స్పూన్స్
జీడిపప్పులు – 10
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2-3
కరివేపాకు – 2 టేబుల్ స్పూన్స్
కారం – 1 టీస్పూన్స్
వెల్లుల్లిరెబ్బలు – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా దొండకాయలను పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.దొండకాయ ముక్కలను గిన్నెలో వేసి అందులోకి శనగపిండి ,కార్న్ ఫ్లోర్ ,కారం ,ఉప్పు,జీలకర్ర పొడి,ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
3.అవసరం అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
4.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి దొండకాయ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేపి పక్కన పెట్టుకోవాలి.

5.ఇప్పుడు అదే ప్యాన్ లో మరో స్పూన్ ఆయిల్ వేసి అందులోకి పల్లీలు,జీడిపప్పులు వేగాక జీలకర్ర,ఆవాలు ,ఎండుమిర్చి ,కరివేపాకు కరకరలాడే విధంగా వేపుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు,కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
7.వేగిన తాలింపులో ఫ్రై చేసిపెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి.
8.అంతే ఎంతో రుచికరమైనా ఫంక్షన్ స్టైల్ దొండకాయ 65 రెడీ.