Healthhealth tips in telugu

Joint Pains : చలికాలంలో కీళ్ళనొప్పులు తగ్గేందుకు ఇలా చేయండి

Joint Pains Home Remedies:కీళ్ళనొప్పులు ఉన్నవారు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికాలంలో ఈ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు అరవై సంవత్సరాల వయస్సులో వచ్చే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు అనేవి ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. దాంతో చాలా కంగారూ పడిపోయి పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు.

అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అదే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఈ రెమిడీ కోసం తేనె, తెల్ల నువ్వులు, శొంఠి పొడి ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ తేనె, అరస్పూన్ నువ్వులు, పావుస్పూన్ శొంఠి పొడి వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టి ఆ తర్వాత తినాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తినవచ్చు. 15 రోజుల పాటు తింటూ ఉంటే క్రమంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల మధ్య జిగురు కూడా పెరుగుతుంది.

కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఈ చిట్కాలో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించటానికి ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.